Saturday, March 26, 2016

యేసు పునరుత్థానము



1 కొరింథీ 15
తండ్రీ కొడుకులు కారులో ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా ఒక కందిరీగ కారులో ప్రవేశించింది. కొడుకు భయపడి కేకలు పెడుతున్నాడు. తండ్రి ఒక్కసారిగా ఆ కందిరీగను అరచేతిలో పట్టుకొని విడిచిపెట్టాడు. ఆ కందిరీగ మరలా కారులో తిరుగుతుంటే కొడుకు కేకలు పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు తండ్రి తన చేతిని చూపించి, “ఇదుగో, ఈ కందిరీగ ముల్లు నా చేతిలో విరిగింది. నిన్నది యికపై కుట్టలేదు” అని చెప్పాడు.

1 కొరింథీ 15:55-56: “ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ( http://ministry127.com).

1. పునరుత్థానమును గుర్చిన ప్రవచనాలు:
·         కీర్తనలు 16:10: ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.
·         యోహాను 2:19: యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.
2. పునరుత్థానము యొక్క ప్రాముఖ్యత:
·         1 కొరింథీ 15:17: క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు.
·         రోమా 4:24-25: 24: మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను. 25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
3. పునరుత్థానము యొక్క హేతుబద్ధత:
·         1 కొరింథీ 15:21: మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.
ఆఫ్రికాలో ఒక ముస్లిం వ్యక్తి యేసునందు విశ్వాసముంచినప్పుడు ‘ఎందుకలా చేసావ’ని తన స్నేహితులు ప్రశ్నించారు. దానికి అతడు, ‘ఒక దారిన పోతున్నప్పుడు రెండు దారులు ఎదురయ్యాయి. ఒక దారి చివరన చనిపోయిన వాడు ఒకడు మరియు వేరొక దారిన బ్రతికున్నవాడు ఒకడు ఉన్నాడు. అప్పుడు నువ్వు ఏ దారిన వెళతావు?’ (Warren Webster, April, 1980, HIS, p. 13)
సజీవుడైన యేసును వెంబడించాలి.
·         యోబు 19:25-27: అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. 26 ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. 27 నామట్టుకు నేనే చూచెదను.మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయననుచూచెదనునాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి.
·         1 కొరింథీ 15:42: మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును
4. పునరుత్థానము యొక్క హెచ్చరిక
·         1 కొరింథీ 15:34:  నీతిప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకుసిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను.
·         1 కొరింథీ 15:58:  మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
ఒక పార్కులో పెద్ద చెట్టు ఉంది. దాని మొదలులో ఒక ప్రాకే మొక్క మొలిచి ఆ చెట్టును అల్లుకుంటూ పైకి ప్రాకుతూ ఉంది. చివరికి అది పూర్తిగా చెట్టును చంపివేసే స్థితికి వచ్చింది. పార్కులో పనివారు ఆ ప్రాకే మొక్క మొదలును నరికారు. ఆ మొక్క ఆ చెట్టు చుట్టూ అలుముకొనే ఉంది కానీ ఇప్పుడది చచ్చినది కనుక ఆ చెట్టుకు అపాయం లేదు. (J. Alistair Brown.) పాపం క్రిస్తుచే ఓడించబడింది. దానిని మరలా మన జీవితాలలో పెంచి పోషించకూడదు.



1 comment: