ఒకరితో స్నేహం నుండి విడిపోవడానికి 5 కారణాలు
http://www.churchleaders.com/outreach-missions/outreach-missions-articles/275549-5-reasons-why-you-may-need-to-break-off-a-relationship.html/2లో నుండి కొన్ని చికెన్ ముక్కలు (ఇంగ్లీషులో nuggets అంటారులెండి...)
నమ్మకంగా ఉండటం మంచిది.
కానీ, కొన్ని సార్లు అది మన బలహీనతగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా కుదరని సంబంధాలను
విడిచిపెట్టడమే మంచిది. అది నమ్మకత్వ లోపం కాదు. మనం నమ్మకంగా ఉండాలని నిజం
మాట్లాడలేకపోవడం లేదా ఎదుటివారిని బాధ్యత వహించనీయకపోవడం కూడా తప్పే. కొన్ని
సార్లు, ఎంత ప్రయత్నించినా పనిచేయని సంబధాలు మనం విడిచి పెట్టలేకపోవడానికి చెదరిన మన
బాల్యం కారణం కావచ్చు.
1. వేదనతో కూడిన
కుటుంబం:
ఉదాహరణకు, తాగుడు
అలవాటైన తండ్రి ఉంటే, బాధల్లో బ్రదికేయటం సాధారణం కావచ్చు. కానీ అది శ్రుతిమించి
మనం స్పర్శ కోల్పోయేవిధంగా చేస్తే, మన స్నేహితుల విషయంలో కూడా బాధను భరిస్తూ సంబంధాలను కొనసాగించుట వలన మనకు మనమే మానసిక హాని చేసుకుంటాం.
2. యితరుల తప్పులు మనపై
వేసుకోవడం:
పైన చెప్పిన
పరిస్థితుల్లో పెరిగిన పిల్లలు తండ్రి తప్పులను కప్పివేయడం అలవాటై ఉంటారు కనుక, ఇతరుల
తప్పులను వారి పై మోపుకోవడానికి వెనుకాడరు. కనుక మీ స్నేహంలో ఎదుటివారి తప్పులను
కుడా మీ పైనే వేసుకొని వేదనలోనే సంబధాలను కొనసాగిస్తారు. నిజంగా, యితరుల తప్పుల
బాధ్యత మనం భరించనవసరంలేదు. అలా చేస్తే, వారు తప్పు చేసి తప్పుకోవడం అలవాటు
చేసుకొని సంబంధాలు ఎప్పటికీ బాగుపడవు.
3. వదిలేస్తే నేను
ఓడిపోయినట్లే:
కుటుంబం కాబట్టి, మీరు
మొత్తానికి చాలా కాలంగా నెట్టుకొస్తున్నారు. మీరు చాలా గట్టివారే! బయటి స్నేహాల్లో
అది అనవసరమైన వేదననే మీకు మిగిలిస్తుంది. మీ నమ్మకత్వ లోపం చేత వారిని
విడిచిపెట్టకూడదు గాని పనిచేయని సంబంధాలతో చతికిలపడితే జీవితంలో నిజంగానే ఓటమిని చూస్తారు.
4. నమ్మకత్వాన్ని అపార్థంచేసుకోవడం:
నమ్మకంగా ఉండటం ఒకటైతే, మీ స్నేహితులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేయడం (abuse) మరొకటి. కొందరు స్నేహితులు మాయచేసి మిమ్మల్ని వాడేసుకుంటారు (manipulative). కొన్నిసార్లు ఒక హద్దు నియమించడం అవసరం. మీరెంతటి వాగ్దానం చేసారు అలాగే, వారికెంత అర్హత ఉంది? అంత నమ్మకంగా మీరు మీ కుటుంబం పట్ల ఉంటున్నారా?
నమ్మకంగా ఉండటం ఒకటైతే, మీ స్నేహితులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేయడం (abuse) మరొకటి. కొందరు స్నేహితులు మాయచేసి మిమ్మల్ని వాడేసుకుంటారు (manipulative). కొన్నిసార్లు ఒక హద్దు నియమించడం అవసరం. మీరెంతటి వాగ్దానం చేసారు అలాగే, వారికెంత అర్హత ఉంది? అంత నమ్మకంగా మీరు మీ కుటుంబం పట్ల ఉంటున్నారా?
5. ఒకరిపై ఒకరు ఆధారపడటం:
మీరు పరిపక్వతలోనికి ఎదగటం మానుకొని, మీ బలహీనతలను
కప్పిపెట్టే మీ స్నేహితుని/స్నేహితురాలి బలహీనతపై ఆధారపడుతున్నరేమో! వారిని కూడా
పరిపక్వత చెందకుండా మీరు అడ్డుకుంటున్నారేమో! మార్పు కష్టమైనది. మానసిక, ఆత్మీయ
ఎదుగుదల కొరకు పట్టుదల కలిగియుండుట చాలా కష్టం. నలిగిపోయిన మీ బలహినతలో కొనసాగుతూ,
మీ అపరిపక్వతను సమర్థించేవారితో సమయం గడపటం చాలా సుళువైన పని. కానీ అది మీ
జీవితానికి కానీ, వారి జీవితానికి కానీ ఆరోగ్యకరమైన పని కాదు.
ముగింపు:
మనకు బాధ కలిగించే వారితో అస్సలు మాట్లాడటం
మానేసి వారిని ద్వేషించాలని కాదు. కానీ, కొన్ని హద్దులు నియమించుకోవాలి. ఇద్దరి
మంచి కోసం.
ఎలా?
మీ పరిస్థితికి వెలుపల ఉన్నవారిని కనుగొనండి. మీ
సంబంధం/స్నేహంలో ఎంతవరకు దుర్వినియోగం జరుగుతుందో కనిపెట్టగలిగి, ఎక్కడ వరకు హద్దులు
పెట్టాలో తెలియజేయగలిగిన సలహాదారులను సంప్రదించండి. కష్టమైన విషయాలు చర్చించడానికి
సిద్ధపడండి. మత్తయి 18:12-35లోని సూచనలు గుర్తుపెట్టుకోండి. మీ మనసులో మాట
చెప్పలేకపోతే, అది వ్యక్తం చేయగలిగిన మరొక వ్యక్తి సహాయం తీసుకోండి. ఆత్మీయ దన్ను
తీసుకోండి. మీతో, మీకొరకు ప్రార్థించే వారిని,
దేవుడు మీకు తెలియజేయాలని ఆశిస్తున్న విషయాలు మీతో చర్చించగలిగేవారి సహాయం
పొందుకోండి [సిగ్గు పడవద్దు. అలాగే, జాగ్రత్తగా ఉండండి]. మీరున్న పరిస్థితుల్లో మీకు
సహాయం అవసరం.
No comments:
Post a Comment