లేఖన భాగం:
కొలస్సీ 2:13-15
2. సిలువలో ఆయన మన పాపములను తుడుచివేసెనుకొలస్సీ 2:13-15
క్రైస్తవ జీవితములో సిలువ చాలా ప్రాముఖ్యమైనది.
మన సిలువను మనం ఎత్తుకొనవలెనని క్రీస్తు చెప్పారు. కానీ, యేసు సిలువలో మరణించుట
ద్వారా ఆయన మన జీవితాలలో చేసిన గొప్ప కార్యమును మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి.
క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా మనకు పాప క్షమాపణ ఏవిధంగా లభిస్తుంది?
ధ్యానిద్దాం.
1. మన గత స్థితి
- మన అపరాధముల వలన మరియు శరీరమందు సున్నతి లేకుండుట వలన అనగా, నిబంధన సంబంధులము కాకుండుట వలన చచ్చిన వారమైయున్నాము.
- “శరీరమందు సున్నతి లేకుండుట” అను మాటలో “శరీరము” అనుదానిని “Sinful nature” (పాపపు స్వభావం) అని NIV బైబిలు అనువదిస్తుంది. దీనికి మూల భాషయైన గ్రీకులో Sarx అనే పదం వాడబడింది. అనగా, మాంసము, శరీరము లేదా మానవ నైజం అని అర్థం.
- మనం చేసేది పాపమైతే, మన చేత ఆ పాపాన్ని చేయించేది మనలోని పాపపు నైజం. ఇది మన గత స్థితి. మునుపు సాతానును అనుసరించి, ఈ లోక ధర్మము చొప్పున నడచుకొని, శరీరము మరియు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుట వలన దైవ ఉగ్రతకు లోనైన వారముగా ఉన్నామని ఎఫెస్సీ 2:1-3 లో మన గత స్థితిని పౌలు వర్ణించాడు. దైవ ఉగ్రత మన భవిష్యత్తు.
ఉపమానం:
ఒక పాత కథ
మనకు దీనిని చక్కగా వివరిస్తుంది. ఒక వ్యక్తి జెట్టీ వద్ద చిన్న పడవలో మనుషులను ఆ
దరికి ఈ దరికి చేరవేసే పని చేసేవాడు. ఒక మధ్యాహ్నం బాగా అలసిపోయి తన పడవను ఒడ్డున
ఉన్న ఒక చెట్టుకు కట్టివేసి పడవలో పడుకుని కునుకు తీయడం ప్రారంభించి
కొంత సేపటికి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. నదీ ప్రవాహానికి పడవ అటు యిటు కదిలి,
తాడు కాస్త ఊడిపోయి పడవ ప్రవాహంలో కొట్టుకుపోవడం ప్రారంభించింది. కొంత దూరంలో
లోతైన జలపాతం ఉండుట వలన అతడు ప్రాణాపాయంలో ఉన్నాడు కానీ నిద్రలో ఉండుట చేత తన
స్థితిని తాను గమనించలేక పోయాడు. చివరికి, అక్కడకు వచ్చిన వారి కేకలకు మేల్కొని తన
ప్రాణాలు కాపాడుకున్నాడు.
- మరణకరమైన స్థితినుండి దేవుడు మనలను క్షమించి విమోచించాడని కొలస్సీ 1:13-15లో మనకు చెప్పబడుతుంది.
- ఆయన ఈ కార్యమును చేసిన విధానం: దేవుని వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు లేదా ధర్మశాస్త్రం మన పై నేరారోపణ చేస్తుంది. మన పాపములచే మన దస్తూరితో వ్రాసుకున్న ఋణపత్రము చట్టరీత్యా మనకు విరోధముగా ఉన్నది. కానీ, క్రీస్తు సిలువ మరణము ద్వారా దేవుడు ఆ ఋణపత్రమును సిలువకు మేకులతో కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసెను.
- ఒక వ్యక్తి ఇలా చెప్పాడు: “తీర్చలేని ఋణమును మనము కలిగియున్నందున తనకు లేని ఋణమును తీర్చుటకు ఆయన వచ్చెను.”
- మత్తయి 18: 23-27లో యేసు చెప్పిన ఉపమానంలో, దేవుడు ఓర్పుతోను కనికరముతోను మనలను విడిచిపెట్టి మన ఋణమును క్షమించిన విధానం మనకు అగుపిస్తుంది.
3. సిలువలో ఆయన మనలను జీవింపచేసెను
- “మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.” అని 1 పేతురు 2:24లో చెప్పబడింది.
- క్రీస్తు పునరుత్థానములో మనలను ఆయనతో కూడా బ్రదికించెను అని ఎఫెస్సీ 2:4-7లో పౌలు వ్రాస్తున్నాడు.
- పాపమును, దాని శక్తిని క్రీస్తు సిలువ త్యాగం ఓడించగా, ఆయన పునరుత్థానము మరణమును ఓడించి మనకు నిత్య జీవమును ప్రసాదించినది. విజయమందు మరణము మ్రింగివేయబడెను (1కొరింథీ 15:54). క్రీస్తులో ఉన్న మనకిప్పుడు నిత్యజీవము లభించెను.
4. సిలువలో ఆయన శత్రువును నిరాయుధునిగా చేసెను
- క్రీస్తు సిలువలో చేసిన మరొక గొప్ప కార్యం, దేవుడు మన ఋణపత్రమును సిలువకు మేకులతో కొట్టుటద్వారా, దానిని తుడుచివేయుట ద్వారా మరియు మనకు అడ్డముగా లేకుండా చేయుట ద్వారా మనకు విరోధముగా పోరాడే అపవాదిని [ప్రధానులు మరియు అధికారులు: Gk. Arche (మొదటి) & exousia (శక్తి)] నిరాయుధునిగా చేసాడు. మనకు విరుద్ధముగా పోరాడుటకు శత్రువు చేతిలో ఇక ఎటువంటి ఆధారము లేదు.
- అంతేకాదు, విజయోత్సవముతో అపవాది బృందమును సిలువచేత పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.
- రోమా సైన్యాధికారులు యుద్ధములో ఓడించిన రాజులను, సైన్యమును, నిరాయుధులనుగా చేసి వారితో కూడా కొల్ల సొమ్మును ఉరేగింపుగా తమ పట్టణ వీధులలో త్రిప్పినట్లు సాతానును వేడుకకు కనుపరచెను. సాతాను ఓడిపోయిన మరియు నిరాయుధుడైన శత్రువు అని మనం గుర్తించాలి.
ముగింపు:
ఎంత గొప్ప విమోచన! సాతానుడు శక్తి గలవానిగా
నటించినప్పటికీ, క్రీస్తును ఎరిగి, ఆయన శక్తిని ఆశ్రయించి, పాపక్షమాపణ పొందిన వారి
విషయంలో అతడు నిరాయుధుడని మనం మరచిపోకూడదు. నీవు ఒకవేళ క్రీస్తును అంగీకరించని
స్థితిలో ఉంటే, నీ పాపక్షమాపణ నిమిత్తం నేడే క్రీస్తును వేడుకో, సిలువలో
నీకనుగ్రహింపబడిన క్షమను నీ సొంతం చేసుకో.
No comments:
Post a Comment