Telugu sermon blog: Telugu sermons, Telugu mp3 sermons and Telugu Christian articles for the global Telugu Christian community. సార్వత్రిక తెలుగు క్రైస్తవుల కొరకు: ప్రసంగములు, సంఘ నాయకులు, యూత్ లీడర్స్, వర్షిప్ లీడర్స్, సండేస్కూల్ టీచర్లకు ఉపయోగపడే వ్యాసములు చదవండి. Telugu Prasangalu.
Wednesday, November 23, 2016
Saturday, March 26, 2016
యేసు పునరుత్థానము
1 కొరింథీ 15
తండ్రీ కొడుకులు కారులో ప్రయాణిస్తున్నారు.
అకస్మాత్తుగా ఒక కందిరీగ కారులో ప్రవేశించింది. కొడుకు భయపడి కేకలు పెడుతున్నాడు.
తండ్రి ఒక్కసారిగా ఆ కందిరీగను అరచేతిలో పట్టుకొని విడిచిపెట్టాడు. ఆ కందిరీగ మరలా
కారులో తిరుగుతుంటే కొడుకు కేకలు పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు తండ్రి తన చేతిని
చూపించి, “ఇదుగో, ఈ కందిరీగ ముల్లు నా చేతిలో విరిగింది. నిన్నది యికపై కుట్టలేదు”
అని చెప్పాడు.
1 కొరింథీ 15:55-56: “ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ( http://ministry127.com).
1. పునరుత్థానమును గుర్చిన ప్రవచనాలు:
·
కీర్తనలు 16:10: ఎందుకనగా నీవు నా ఆత్మను
పాతాళములో విడచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.
·
యోహాను 2:19: యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని
వారితో చెప్పెను.
2. పునరుత్థానము
యొక్క ప్రాముఖ్యత:
·
1 కొరింథీ 15:17: క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు.
·
రోమా 4:24-25: 24: మన ప్రభువైన యేసును మృతులలోనుండి
లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను. 25 ఆయన మన అపరాధముల నిమిత్తము
అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
3. పునరుత్థానము
యొక్క హేతుబద్ధత:
·
1 కొరింథీ 15:21: మనుష్యుని ద్వారా మరణము వచ్చెను
గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.
ఆఫ్రికాలో ఒక ముస్లిం వ్యక్తి యేసునందు
విశ్వాసముంచినప్పుడు ‘ఎందుకలా చేసావ’ని తన స్నేహితులు ప్రశ్నించారు. దానికి అతడు, ‘ఒక
దారిన పోతున్నప్పుడు రెండు దారులు ఎదురయ్యాయి. ఒక దారి చివరన చనిపోయిన వాడు ఒకడు
మరియు వేరొక దారిన బ్రతికున్నవాడు ఒకడు ఉన్నాడు. అప్పుడు నువ్వు ఏ దారిన వెళతావు?’
(Warren Webster, April, 1980, HIS, p. 13)
సజీవుడైన
యేసును వెంబడించాలి.
·
యోబు 19:25-27: అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు
నేనెరుగుదును. 26 ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను
దేవుని చూచెదను. 27 నామట్టుకు నేనే చూచెదను.మరి ఎవరును కాదు నేనే
కన్నులార ఆయననుచూచెదనునాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి.
·
1 కొరింథీ 15:42: మృతుల పునరుత్థానమును ఆలాగే.
శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును
4. పునరుత్థానము యొక్క హెచ్చరిక
·
1 కొరింథీ 15:34: నీతిప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి
లేదు. మీకుసిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను.
·
1 కొరింథీ 15:58: మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు
ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
ఒక పార్కులో
పెద్ద చెట్టు ఉంది. దాని మొదలులో ఒక ప్రాకే మొక్క మొలిచి ఆ చెట్టును అల్లుకుంటూ
పైకి ప్రాకుతూ ఉంది. చివరికి అది పూర్తిగా చెట్టును చంపివేసే స్థితికి వచ్చింది.
పార్కులో పనివారు ఆ ప్రాకే మొక్క మొదలును నరికారు. ఆ మొక్క ఆ చెట్టు చుట్టూ
అలుముకొనే ఉంది కానీ ఇప్పుడది చచ్చినది కనుక ఆ చెట్టుకు అపాయం లేదు. (J.
Alistair Brown.) పాపం క్రిస్తుచే ఓడించబడింది. దానిని మరలా మన
జీవితాలలో పెంచి పోషించకూడదు.
Monday, March 14, 2016
సిలువ రహస్యం
లేఖన భాగం:
కొలస్సీ 2:13-15
2. సిలువలో ఆయన మన పాపములను తుడుచివేసెనుకొలస్సీ 2:13-15
క్రైస్తవ జీవితములో సిలువ చాలా ప్రాముఖ్యమైనది.
మన సిలువను మనం ఎత్తుకొనవలెనని క్రీస్తు చెప్పారు. కానీ, యేసు సిలువలో మరణించుట
ద్వారా ఆయన మన జీవితాలలో చేసిన గొప్ప కార్యమును మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి.
క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా మనకు పాప క్షమాపణ ఏవిధంగా లభిస్తుంది?
ధ్యానిద్దాం.
1. మన గత స్థితి
- మన అపరాధముల వలన మరియు శరీరమందు సున్నతి లేకుండుట వలన అనగా, నిబంధన సంబంధులము కాకుండుట వలన చచ్చిన వారమైయున్నాము.
- “శరీరమందు సున్నతి లేకుండుట” అను మాటలో “శరీరము” అనుదానిని “Sinful nature” (పాపపు స్వభావం) అని NIV బైబిలు అనువదిస్తుంది. దీనికి మూల భాషయైన గ్రీకులో Sarx అనే పదం వాడబడింది. అనగా, మాంసము, శరీరము లేదా మానవ నైజం అని అర్థం.
- మనం చేసేది పాపమైతే, మన చేత ఆ పాపాన్ని చేయించేది మనలోని పాపపు నైజం. ఇది మన గత స్థితి. మునుపు సాతానును అనుసరించి, ఈ లోక ధర్మము చొప్పున నడచుకొని, శరీరము మరియు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుట వలన దైవ ఉగ్రతకు లోనైన వారముగా ఉన్నామని ఎఫెస్సీ 2:1-3 లో మన గత స్థితిని పౌలు వర్ణించాడు. దైవ ఉగ్రత మన భవిష్యత్తు.
ఉపమానం:
ఒక పాత కథ
మనకు దీనిని చక్కగా వివరిస్తుంది. ఒక వ్యక్తి జెట్టీ వద్ద చిన్న పడవలో మనుషులను ఆ
దరికి ఈ దరికి చేరవేసే పని చేసేవాడు. ఒక మధ్యాహ్నం బాగా అలసిపోయి తన పడవను ఒడ్డున
ఉన్న ఒక చెట్టుకు కట్టివేసి పడవలో పడుకుని కునుకు తీయడం ప్రారంభించి
కొంత సేపటికి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. నదీ ప్రవాహానికి పడవ అటు యిటు కదిలి,
తాడు కాస్త ఊడిపోయి పడవ ప్రవాహంలో కొట్టుకుపోవడం ప్రారంభించింది. కొంత దూరంలో
లోతైన జలపాతం ఉండుట వలన అతడు ప్రాణాపాయంలో ఉన్నాడు కానీ నిద్రలో ఉండుట చేత తన
స్థితిని తాను గమనించలేక పోయాడు. చివరికి, అక్కడకు వచ్చిన వారి కేకలకు మేల్కొని తన
ప్రాణాలు కాపాడుకున్నాడు.
- మరణకరమైన స్థితినుండి దేవుడు మనలను క్షమించి విమోచించాడని కొలస్సీ 1:13-15లో మనకు చెప్పబడుతుంది.
- ఆయన ఈ కార్యమును చేసిన విధానం: దేవుని వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు లేదా ధర్మశాస్త్రం మన పై నేరారోపణ చేస్తుంది. మన పాపములచే మన దస్తూరితో వ్రాసుకున్న ఋణపత్రము చట్టరీత్యా మనకు విరోధముగా ఉన్నది. కానీ, క్రీస్తు సిలువ మరణము ద్వారా దేవుడు ఆ ఋణపత్రమును సిలువకు మేకులతో కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసెను.
- ఒక వ్యక్తి ఇలా చెప్పాడు: “తీర్చలేని ఋణమును మనము కలిగియున్నందున తనకు లేని ఋణమును తీర్చుటకు ఆయన వచ్చెను.”
- మత్తయి 18: 23-27లో యేసు చెప్పిన ఉపమానంలో, దేవుడు ఓర్పుతోను కనికరముతోను మనలను విడిచిపెట్టి మన ఋణమును క్షమించిన విధానం మనకు అగుపిస్తుంది.
3. సిలువలో ఆయన మనలను జీవింపచేసెను
- “మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.” అని 1 పేతురు 2:24లో చెప్పబడింది.
- క్రీస్తు పునరుత్థానములో మనలను ఆయనతో కూడా బ్రదికించెను అని ఎఫెస్సీ 2:4-7లో పౌలు వ్రాస్తున్నాడు.
- పాపమును, దాని శక్తిని క్రీస్తు సిలువ త్యాగం ఓడించగా, ఆయన పునరుత్థానము మరణమును ఓడించి మనకు నిత్య జీవమును ప్రసాదించినది. విజయమందు మరణము మ్రింగివేయబడెను (1కొరింథీ 15:54). క్రీస్తులో ఉన్న మనకిప్పుడు నిత్యజీవము లభించెను.
4. సిలువలో ఆయన శత్రువును నిరాయుధునిగా చేసెను
- క్రీస్తు సిలువలో చేసిన మరొక గొప్ప కార్యం, దేవుడు మన ఋణపత్రమును సిలువకు మేకులతో కొట్టుటద్వారా, దానిని తుడుచివేయుట ద్వారా మరియు మనకు అడ్డముగా లేకుండా చేయుట ద్వారా మనకు విరోధముగా పోరాడే అపవాదిని [ప్రధానులు మరియు అధికారులు: Gk. Arche (మొదటి) & exousia (శక్తి)] నిరాయుధునిగా చేసాడు. మనకు విరుద్ధముగా పోరాడుటకు శత్రువు చేతిలో ఇక ఎటువంటి ఆధారము లేదు.
- అంతేకాదు, విజయోత్సవముతో అపవాది బృందమును సిలువచేత పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.
- రోమా సైన్యాధికారులు యుద్ధములో ఓడించిన రాజులను, సైన్యమును, నిరాయుధులనుగా చేసి వారితో కూడా కొల్ల సొమ్మును ఉరేగింపుగా తమ పట్టణ వీధులలో త్రిప్పినట్లు సాతానును వేడుకకు కనుపరచెను. సాతాను ఓడిపోయిన మరియు నిరాయుధుడైన శత్రువు అని మనం గుర్తించాలి.
ముగింపు:
ఎంత గొప్ప విమోచన! సాతానుడు శక్తి గలవానిగా
నటించినప్పటికీ, క్రీస్తును ఎరిగి, ఆయన శక్తిని ఆశ్రయించి, పాపక్షమాపణ పొందిన వారి
విషయంలో అతడు నిరాయుధుడని మనం మరచిపోకూడదు. నీవు ఒకవేళ క్రీస్తును అంగీకరించని
స్థితిలో ఉంటే, నీ పాపక్షమాపణ నిమిత్తం నేడే క్రీస్తును వేడుకో, సిలువలో
నీకనుగ్రహింపబడిన క్షమను నీ సొంతం చేసుకో.
Subscribe to:
Posts (Atom)